“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ మాస్ అప్డేట్.!

“వాల్తేరు వీరయ్య” పై లేటెస్ట్ మాస్ అప్డేట్.!

Published on Nov 15, 2022 9:47 PM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) శరవేగంగా తెరకెక్కిస్తుండగా మేకర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది. మరి ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటుగా మాస్ మహారాజ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి తన 40 నిమిషాల మేర ఉండగా ఇప్పుడు తనపైనే అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లను మేకర్స్ తెరకెక్కిస్తున్నారట.

టాలీవుడ్ ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల సారథ్యంలో మేకర్స్ ఈ సీక్వెన్స్ ని మాస్ మహారాజ్ పై తెరకెక్కిస్తున్నారట. మరి ఇది రవితేజ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు