‘విక్రమ్’ : మోస్ట్ అవైటెడ్ మాస్ సాంగ్ రిలీజ్ … !!

Published on Jul 1, 2022 7:00 pm IST

కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ తొలిసారిగా కలిసి చేసిన మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా స్థాయిలో దీనిని నిర్మించారు. ఇక అన్ని భాషల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ డూపర్ టాక్ సొంతం చేసుకున్న విక్రమ్, ఇటీవల ఓవరాల్ గా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్ ని అందుకుంది. థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకడు లోకేష్ ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీసి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు..

అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ ముఖ్య పాత్రలు చేసారు. అయితే ఈనెల 8న డిస్నీ హాట్ స్టార్ ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్న విక్రమ్ నుండి నేడు కొద్దిసేపటి క్రితం పాతాళ పాతాళ మాస్ సాంగ్ ఫుల్ వీడియోని యూట్యూబ్ లో విడుదల చేసింది యూనిట్. ఈ మూవీకి అనిరుద్ అందించిన సాంగ్స్ అన్ని ఎంతో అలరించినప్పటికీ, పాతాళ సాంగ్ అయితే మరింతగా మాస్, యూత్ ని ఎంతో ఆకట్టుకుంది. ఈ సాంగ్ ని అనిరుద్ తో కలిసి కమల్ పాడగా, దీనికి అదిరిపోయే రేంజ్ లో ఊర మాస్ ట్యూన్ ఇచ్చారు అనిరుద్. ఇక ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :