గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన రెండు సాంగ్స్ మంచి చార్ట్ బస్టర్ అయ్యాయి.
శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే ఎంత స్పెషల్ ఎంత భారీతనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే గేమ్ ఛేంజర్ లో కూడా సాంగ్స్ కోసం కోట్ల డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేసినట్టు ఆ మధ్య నిర్మాత దిల్ రాజే తెలిపారు. ఇక ఇపుడు నెక్స్ట్ రానున్న సాంగ్ కోసం బజ్ తెలుస్తుంది.
దీనితో ఈ రానున్న మూడో సాంగ్ అది కూడా మెలోడికి ఏకంగా మేకర్స్ 20 కోట్లు వెచ్చించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సాంగ్ విజువల్స్ ఏ లెవెల్లో ఉండనున్నాయో అర్ధం చేసుకోవచ్చు. థమన్ అందించిన ఈ సాంగ్ ఈ అక్టోబర్ చివరిలో రానుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతుంది.