“చరణ్ 15” కి అక్కడ మాసివ్ డీల్.?

Published on Sep 14, 2022 10:01 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన శంకర్ కాంబోలో ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు శంకర్ అలాగే చరణ్ కెరీర్ లో కూడా ఇది 15వ సినిమా కావడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొనగా షూటింగ్ ని కూడా శంకర్ వేరే లెవెల్లో ప్లాన్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ కి పాన్ ఇండియా లెవెల్లో కానీ గ్లోబల్ గా గాని ఏ రేంజ్ ఆదరణ వచ్చిందో చూస్తున్నాము అందుకు తగ్గట్టే ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబోకి గాను భారీ బిజినెస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నాన్ థియేట్రికల్ హక్కులకు రికార్డు ధర పలికినట్టుగా బజ్ ఉండగా..

ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా మాసివ్ డీల్ ఈ సినిమాకి ఉన్నట్టు తెలుస్తుంది. సుమారు 5 మిలియన్ డాలర్స్ మేర ఈ సినిమాకి అన్ని భాషల్లో కలిపి మేకర్స్ డీల్ లాక్ చేయనున్నట్టుగా టాక్. మరి దీనిపై అయితే ఇంకా సరైన అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :