లేటెస్ట్..”బాలయ్య 108″ టైటిల్ లాంచ్ కి మాసివ్ ప్లానింగ్.!

Published on Jun 7, 2023 12:01 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అయితే రెడీ అవుతున్న మాస్ యాక్షన్ డ్రామా కోసం అందరికీ తెలిసిందే మరి ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 108వ సినిమాగా తెరకెక్కుతూ ఉండగా ఇప్పుడు ఈ సాలిడ్ ప్రాజెక్ట్ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే దీనిపై బాలయ్య బర్త్ డే లోపు బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు ఈ చిత్రం టైటిల్ కి మేకర్స్ చేసిన మాసివ్ ప్లానింగ్ ని అయితే రివీల్ చేశారు. అయితే ఇది బాలయ్య 108 సినిమా కాగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మొత్తం 108 ప్రాంతాల్లో 108 భారీ హోర్డింగ్స్ తో అయితే ఈ మాస్ టైటిల్ ని రేపు జూన్ 8న లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి మన టాలీవుడ్ దగ్గరే ఫస్ట్ ఎవర్ ప్లానింగ్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా శ్రీ లీల ఓ కీలక పాత్రలో నటించింది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ దసరా కనుకగా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం :