ఆఫ్ లైన్ లో “గాడ్ ఫాథర్” కి మాసివ్ ప్రమోషన్స్.!

Published on Sep 28, 2022 12:57 am IST

లేటెస్ట్ టాలీవుడ్ మరో మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాథర్” సినిమా కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ లు నటించిన ఈ ఎపిక్ మల్టీ స్టారర్ ని మోహన్ రాజా తెరకెక్కించారు. అయితే ఇది ఓ రీమేక్ కావడంతో స్టార్టింగ్ లో పెద్దగా హైప్ రాలేదు పైగా ఆచార్య ఎఫెక్ట్ కూడా ఉండడంతో మెగా ఫ్యాన్స్ కాస్త కంగారులోనే ఉన్నారు.

కానీ మెగాస్టార్ కెరీర్ లో రీమేక్ ఎలాంటి క్రేజ్ అయితే వస్తుందో ఫైనల్ గా ఈ సినిమాకి కూడా అదే మ్యాజిక్ జరిగింది. టీజర్, ఫస్ట్ సింగిల్ లు మంచి రీచ్ ని అందుకోవడం ఒకెత్తు అయితే ఈ సినిమాకి ఆఫ్ లైన్ లో ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయని చెప్పాలి. ఓ పక్క అభిమానులు చేసుకుంటున్న ప్రమోషన్స్ మరో పక్క మేకర్స్ ప్లాన్ చేసిన ఆఫ్ లైన్ ప్రమోషన్స్ మాంచి మాసివ్ లెవెల్లో నడుస్తున్నాయి. దీనితో అయితే గాడ్ ఫాథర్ పై ఫైనల్ గా అనుకున్న హైప్ అయితే నెలకొందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :