లేటెస్ట్ : యుఎస్ఏ లో ‘భోళా శంకర్’ రిలీజ్ కి భారీ ప్లానింగ్స్

Published on Jun 4, 2023 3:02 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భోళా శంకర్. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న భోళా శంకర్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ కి చెల్లెలిగా నటిస్తోంది. మొదటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ భోళా మేనియా ప్రోమో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఫుల్ సాంగ్ ని రేపు విడుదల చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా అమెరికాలో దాదాపు 600కి పైగా లొకేషన్లలో విడుదల కానుందని తాజా సమాచారం.

ప్రత్యంగిరా సినిమాస్ అక్కడ భోళా శంకర్‌ని విడుదల చేస్తోంది. ఆచార్య మినహా, చిరు రీఎంట్రీ తర్వాత రిలీజ్ అన్ని సినిమాలు యుఎస్ఏ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి, దీనిని బట్టి ఓవర్సీస్ లో మెగాస్టార్ యొక్క బలం మనం అర్ధం చేసుకోవచ్చు. మరి భోళా శంకర్ రిలీజ్ తరువాత అక్కడ ఎంతమేర రాబడుతుందో చూడాలి. ఇక రీసెంట్‌గా స్విట్జర్లాండ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ని ముగించుకున్న భోళా శంకర్ ని ఆగస్ట్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :