యూఎస్ లో భారీ స్థాయిలో విడుదలవుతున్న సర్కార్ !


తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రం యూఎస్ లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. సుమారు 150 లొకేషన్లలో ఈచిత్రం అక్కడ విడుదలకానుందని సమాచారం. కోలీవుడ్ మూవీస్ మరియు నర్మదా ట్రావెల్స్ భారీ ధరకు ఈ ఓవర్సీస్ రిలీజ్ హక్కులను దక్కించుకున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను అక్టోబర్ 19న సాయంత్రం గంటలకు విడుదలచేయనున్నారు.

పొలిటికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా రాధా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ , యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు ,తమిళ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది.

Exit mobile version