“రావణాసుర..మాస్ మహారాజ్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్.!

“రావణాసుర..మాస్ మహారాజ్ స్పీచ్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Apr 1, 2023 2:03 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, దక్ష నగర్కార్ మరియు పూజిత పొన్నాడ లు నటించిన లేటెస్ట్ చిత్రం “రావణాసుర”. దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా అయితే ప్లాన్ చేయగా సినిమా ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ కి ఇప్పుడు భారీ రెస్పాన్స్ అయితే నమోదు అవుతూ వస్తుండడం విశేషం.

ఇక ఈ చిత్రానికి ఆల్రెడీ 20 మిలియన్స్ మేర వ్యూస్ రాగా ఈరోజు సినిమా మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ లో అయితే వరుసగా రెండు భారీ కొట్టిన తర్వాత రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ కోసం అయితే ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మాస్ మహారాజ్ అయితే ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.. ఇక ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ అలాగే భీమ్స్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఏప్రిల్ 7న అయితే ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు