“ఆదిపురుష్” బుకింగ్స్ కి మాసివ్ రెస్పాన్స్.!

Published on May 19, 2023 9:07 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఆదిపురుష్” కోసం తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా నెవర్ బిఫోర్ విజువల్స్ తో అయితే గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఇక ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా ఆకాశాన్ని అంటిన అంచనాలు ఈ సినిమా డెఫినెట్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అని అనిపించేలా చేసింది.

ఇక ఈ చిత్రం అయితే గత కొన్ని వారాల కితమే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో వరల్డ్ లోనే మొదటి షో ని వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. కానీ ఈ షో అయితే క్యాన్సిల్ అయ్యింది. కాకపోతే 13న షో క్యాన్సిల్ అయ్యింది కానీ జూన్ 15న షో అయితే ఉంది. మరి ఈ జూన్ 15 17సహా తారీఖుల్లో షో లు అయితే ఇప్పుడు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో హౌస్ఫుల్స్ పడినట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా అక్కడ ఎన్నో చిత్రాలు ఉన్నప్పటికీ ఇంకా రిలీజ్ కి ఎంతో సమయం ఉన్న ఆదిపురుష్ షో లు సోల్డ్ అవుట్ అవ్వడం విశేషం. దీనితో అసలు ఈ సినిమాకి ఉన్న హైప్ ఈ మాసివ్ రెస్పాన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :