‘దూకుడు’ స్పెషల్ షోస్ కి భారీ మాసివ్ రెస్పాన్స్.!

Published on Sep 23, 2021 12:26 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్టో మళ్ళీ అలాంటి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన చిత్రం “దూకుడు”. దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సమంతా హీరోయిన్ గా మొదటిసారిగా చేసిన ఈ చిత్రం సరిగ్గా పదేళ్ల కితం రిలీజ్ అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి భారీ రికార్డునే సెట్ చేసింది.

మహేష్ మాస్ యుఫోరియా కి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. మరి టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డులు సెట్ చేసిన ఈ చిత్రం ఈరోజు సెప్టెంబర్ 23తో పదేళ్లు పూర్తి చేసుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఈ మూమెంట్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా ప్లాన్ చేసిన స్పెషల్ షోస్ కి గాను నెవర్ బిఫోర్ రెస్పాన్స్ ని కొల్లగొట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాలు సహా బెంగళూర్ లో కూడా వేసిన ఈ సినిమా స్పెషల్ షోస్ కి కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడటం గమనార్హం. దీనిని బట్టి దూకుడు ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో అన్నది మనం అర్ధం చేసుకోవచ్చు. ఓ రకంగా టాలీవుడ్ మంచి మాస్ పంచ్ లు, ట్రెండ్ సెట్టింగ్ కామెడీ, చార్ట్ బస్టర్ సాంగ్స్ అన్నీ కూడా కలిపి స్టార్ట్ అయ్యిన సినిమా కూడా ఇదే కావచ్చు. మరి దూకుడు స్పెషల్ షోలు వేస్తున్న థియేటర్స్ లిస్ట్ ఏరియాల వారీగా చూసుకున్నట్టయితే..

హైదరాబాద్
సుదర్శన్ 35MM – 9:00 రాత్రి

విజయవాడ
అన్నపూర్ణ – 7:30 సాయంత్రం

వైజాగ్
శరత్ – 6:30 సాయంత్రం

కాకినాడ
C & C – 7:30 సాయంత్రం

నెల్లూరు
సిరి – 6:30 సాయంత్రం
సిరి (స్క్రీన్ 4) – 6:30 సాయంత్రం

అనంతపురం
శాంతి – 6:00 – సాయంత్రం

రాజమండ్రి
సూర్య ప్యాలెస్ – 8:30 రాత్రి

నంద్యాల
శ్రీరామ – 7:00 సాయంత్రం

భీమవరం
పద్మాలయ మినీ – 8:00 రాత్రి

నరసింహాపురం
కనకదుర్గ – 6:30 సాయంత్రం

ఖమ్మం
వినోద – 9:00 రాత్రి

కడప
ప్రతాప్ – 9:00 రాత్రి

కొవ్వూరు
అనన్య – 6:00 సాయంత్రం

బెంగళూరు
అంజన్ – 6:00 సాయంత్రం

తిరుపతి
కృష్ణ తేజ – 6:30 సాయంత్రం

ప్రొద్దుటూరు
అర్చన – 6:30 సాయంత్రం

ఒంగోలు
గోరంట్ల – 7:30 సాయంత్రం

కర్నూలు
శ్రీరామ – 9:00 రాత్రి

శ్రీకాకుళం
మారుతి – 6:00 సాయంత్రం

మరి ఈ అన్ని చోట్లా కూడా దూకుడు కి హౌస్ ఫుల్ బోర్డులు పడటంతో పాటు ఇంకొంతమంది అభిమానులకు టికెట్లు కూడా దొరకలేదని తెలుస్తుంది. అంతే కాకుండా ఆన్లైన్ బుకింగ్ లో కూడా మహేష్ మ్యానియా ఓ లెవెల్లో ఇంపాక్ట్ చూపించిందంట.

సంబంధిత సమాచారం :