ఓటిటిలో “మైఖేల్” కి మాసివ్ రెస్పాన్స్.!

Published on Feb 27, 2023 9:02 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్ గా దర్శకుడు రంజిత్ జేయకొడి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మైఖేల్” కోసం తెలిసిందే. సందీప్ నుంచి ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన పాన్ ఇండియా సినిమా ఇది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో అయితే థియేటర్లు లో రాణించలేదు. దీనితో ఈ సినిమా త్వరగానే ఓటిటి లో వచ్చేసింది.

ఇక మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా అయితే అందులో ఇప్పుడు మాసివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఈ ఈ ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా అయితే ఇప్పుడు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఓటిటి లో సత్తా చాటుతుంది. ఇక ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించగా వరుణ్ సందేశ్ విలన్ గా నటించాడు.

సంబంధిత సమాచారం :