ఏపీలో “లైగర్” కి మాసివ్ థియేట్రికల్ బిజినెస్.!?

Published on Aug 10, 2022 8:57 am IST


సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ భారీ రెస్పాన్స్ తో గట్టి ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం కి తెలుగు రాష్ట్రాలు సహా హిందీ, ఓవర్సీస్ లో కూడా మంచి బిజినెస్ జరుగుతుంది అని తెలుస్తుంది.

అయితే లేటెస్ట్ గా ఏపీలో బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ అయితే వినిపిస్తుంది. ఒక్క ఏపీలో వైజాగ్ మరియు సీడెడ్ లోనే ఈ చిత్రం 30 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే లైగర్ కి మాత్రం భారీ టార్గెట్ ఉండేలా కనిపిస్తుంది. మరి ఈ అంచనాలు ఈ సినిమా రీచ్ అవుతుందో లేదో చూడాలి.. ఇంకా ఈ సినిమాలో మైక్ టైసన్ మరియు రమ్య కృష్ణ తదితరులు సాలిడ్ రోల్స్ లో చేస్తుండగా ఆగస్ట్ 25న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :