“ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి మాసివ్ ట్రీట్ అట.!

“ఉస్తాద్ భగత్ సింగ్” నుంచి మాసివ్ ట్రీట్ అట.!

Published on Mar 31, 2023 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న నటించనున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో అయితే ప్లాన్ చేసిన సాలిడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా అయితే ఈ ఏప్రిల్ నుంచి పట్టాలెక్కించనుండగా ఈరోజు దర్శకుడు హరీష్ శంకర్ బర్త్ డే కానుకగా అభిమానులు విషెస్ తెలియజేస్తూ మళ్ళీ తమకి గబ్బర్ సింగ్ తరహా హిట్ కావాలని కోరుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ గా సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా తమ డైరెక్టర్ కి పవర్ ఫుల్ విషెస్ తెలియజేస్తూ అతి త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే ఓ మాసివ్ ట్రీట్ ని అందించనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రీట్ ఏంటో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు