మాసివ్ అప్డేట్ : “చిరు 154” నుంచి మెగా ఫోర్సెస్ మాస్ కలయిక..!

Published on Jul 16, 2022 4:23 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ చిత్రాల్లో దర్శకుడు కే ఎస్ రవీంద్ర(బాబీ) తో చేస్తున్న మస్సివ్ ప్రాజెక్ట్ కోసం తెలిసిందే. చిరు కెరీర్ లో 154వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ ఫ్యాన్ స్టఫ్ లా ఓ రేంజ్ లో తెరకెక్కుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా మేకర్స్ అయితే ఇప్పుడు ఓ క్రేజీ మాసివ్ అప్డేట్ ని అందించారు.

ఈ చిత్రంలో మెగాస్టార్ తో కలిసి చాలా కాలం తర్వాత మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడని టాక్ రాగా ఇప్పుడు మేకర్స్ ఈ ఇద్దరు మాస్ ఫోర్సెస్ షూటింగ్ కి కలిసినట్టుగా సాలిడ్ అనౌన్సమెంట్ అందించారు. ఇక దీనిపై రిలీజ్ చేసిన వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ లో వెంకీ, శంకర్ దాదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ల రీమిక్స్ లతో అదిరిపోయింది. మొత్తానికి అయితే ఈ అనౌన్సమెంట్ ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పింది అని చెప్పాల్సిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :