“భోళా శంకర్” మాస్ స్పీడ్..మాసివ్ అప్డేట్స్ ఇవే.!

Published on Dec 8, 2021 1:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” కి రీమేక్ గా చేస్తున్న చిత్రం “భోళా శంకర్” కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. అయితే గత నెలలో మొదలయిన ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు.

ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడమే కాకుండా ఒక మాసివ్ సాంగ్ ని కంప్లీట్ చేసినట్టుగా ఆన్ లొకేషన్ ఫొటోస్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో భారీ సెట్టింగ్స్ లో షూట్ చేశారట.

మెగా మాసివ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే చిత్ర యూనిట్ ఆల్రెడీ రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసేసినట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :