మహేష్ మూవీ కీలక రోల్ లో నటించనున్న మాస్టర్ యాక్టర్ ?

Published on Feb 3, 2023 3:00 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం SSMB 28 మూవీ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా కనిపించనుండగా యువ మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ దీనికి సంగీతం అందించనున్నారు. మొదటి నుండి అందరి లో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సెన్సేషనల్ కాంబో మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా మారింది.

ఇటీవల ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ మూవీలో దాస్ పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్న యువ నటుడు అర్జున్ దాస్, SSMB 28 మూవీలో ఒక కీలక రోల్ చేయనున్నట్లు చెప్తున్నారు. దాదాపుగా పన్నెండేళ్ల విరామం తరువాత తమ ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు చెప్తోంది యూనిట్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :