లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి మంచి హిట్ గా నిలిచిన చిత్రాల్లో క్రేజీ కామెడి థ్రిల్లర్ చిత్రం “మత్తు వదలరా 2” కూడా ఒకటి. టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీసింహా హీరోగా కమెడియన్ సత్య హిలేరియస్ రోల్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి పార్ట్ తరహాలోనే మంచి హిట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్లు రాబడుతుండగా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అదిరే వసూళ్లు నమోదు చేస్తుంది. వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తూ అదరగొడుతుంది.
ఇలా ఈ చిత్రం యూఎస్ లో 8 లక్షల డాలర్స్ గ్రాస్ మార్క్ ని అందుకొని 1 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయ్యే దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
$800K+ USA Gross for #Mathuvadalara2 and is marching towards the magical million dollar mark at USA Box Office ❤️????
USA Release by @PrathyangiraUS.
Book your tickets now!
????️ https://t.co/2FABU3kVn6#BlockbusterMathuvadalara2A @RiteshRana sequel.#MV2 @Simhakoduri23… pic.twitter.com/rMrvsYPJT6
— Mythri Movie Makers (@MythriOfficial) September 18, 2024