మత్తు వదలరా చిత్రం డైరెక్టర్ కొత్త సినిమా ప్రారంభం!

Published on Nov 30, 2021 5:45 pm IST

మత్తు వదలరా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రితేష్ రానాతో క్లాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థలు ఒక సినిమా ను ప్రారంభించడం జరిగింది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ అసోసియేషన్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు, చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి క్లాప్ నివ్వగా, గుణ్ణం గంగరాజు కెమెరా స్వీచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గౌరవ దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్, ఫైట్స్ శంకర్ ఉయ్యాల, లైన్ ప్రొడ్యూసర్ అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాల సుబ్రమణ్యం కేవీవీ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :