‘మట్టికుస్తీ’లో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది – మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో మూవీ టీమ్

‘మట్టికుస్తీ’లో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది – మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో మూవీ టీమ్

Published on Nov 27, 2022 3:00 AM IST


విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చెల్లా అయ్యవు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ మట్టి కుస్తీ. రవితేజ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలపై రూపొందిన ఈ మూవీని తమిళ్ లో గట్టా కుస్తీ పేరుతో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. డిసెంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అయిన మట్టి కుస్తీ మూవీ ప్రమోషన్స్ కొద్దిరోజుల క్రితం స్టార్ట్ చేసిన యూనిట్, అందులోభాగంగా నేడు హైదరాబాద్ లోని ఏఎంబి మాల్ లో మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో ఆడియన్స్ తో కలిసి సందడి చేసారు. అనంతరం హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ, నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకుని తెలుగింటి అల్లుడి అయిన విషయం మీకు తెలిసిందే. తనని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్‌ కు తీసుకొచ్చింది.

నా కెరీర్ లో అతిపెద్ద సినిమా మట్టి కుస్తీ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్‌ కు ధన్యవాదాలు. రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఎంటర్టైన్మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ కూడా ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్‌ ను మాత్రమే చూసి ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది.

అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను అని ఆయన అన్నారు. ఇక హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, నేను చేసిన అమ్ము, పొన్నియన్ సెల్వన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ మట్టి కుస్తీ సినిమాను కూడా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. రవితేజ సర్ విష్ణు విశాల్ సర్‌ ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండియర్‌ గా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ గారి వల్లే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చా. డిసెంబర్ 2న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి అన్నారు. ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ కి మంచి స్పందన రావడంతో మట్టి కుస్తీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు