వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “మట్టి కుస్తీ”

Published on Mar 15, 2023 9:27 pm IST

విష్ణు విశాల్ హీరోగా చెల్ల అయ్యావు రచన, దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా మట్టి కుస్తీ. గతేడాది థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ఈ ఆదివారం స్టార్ మా ఛానల్ లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.

RT టీమ్ వర్క్స్ మరియు వివి స్టూడియోస్ పతాకాల పై రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :