ఓంకార్ “మాయా ద్వీపం” ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుందటే..!

Published on Sep 28, 2021 1:43 am IST


ఆట, మాయాద్వీపం, ఛాలెంజ్ వంటి షోలకు యాంకర్‌గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఓంకార్. ఆ తర్వాత యాంకరింగ్‌ని పక్కన పెట్టి దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. తిరిగి ఈ మధ్య ‘సిక్త్స్ సెన్స్’ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర వీక్షకులకు ఓంకార్ మళ్లీ దగ్గరయ్యాడు. అయితే ఓంకార్ నిర్వహించిన కిడ్స్ రియాలిటీ షో ‘మాయాద్వీపం’ మళ్లీ మొదలు కాబోతుంది.

2007లో తొలిసారి ప్రారంభమైన ‘మాయా ద్వీపం’ రియాలిటీ షో వరుసగా మూడేళ్లు కొనసాగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చి ప్రారంభమై మళ్లీ రెండేళ్లు కొనసాగి ఆగిపోయింది. అయితే ఏడేళ్ల తర్వాత ఈ షో మళ్లీ జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. అక్టోబర్ 3వ తేది ఆదివారం రాత్రి 9:00 గంటలకు ఈ షో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు. కాకులు దూరని కాకడవి, చీమలు దూరని చిట్టడవి.. అంటూ ఓంకార్ చెప్పిన డైలాగ్ ఈ కార్యక్రమంపై చిన్నారుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది.

సంబంధిత సమాచారం :