ఇక “రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ అప్పుడుకి వస్తుందేమో?

Published on Sep 24, 2021 8:25 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా కొన్ని నెలలే సమయం ఉంది కానీ ఇంకాఆ సినిమా నుంచి మేజర్ అప్డేట్స్ చాలానే రావాల్సి ఉన్నాయి. మరి వాటికోసమే ఓ పక్క అభిమానులు సహా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి.

అయితే ఓ అద్భుత ప్రేమకథగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియోపై చాలా అంచనాలు ఉన్నాయి. అందుకే ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని అంతా చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ ని మాత్రం ప్రభాస్ బర్త్ డే కానుకగా హోల్డ్ చేసి ఉంచుతున్నారని డౌట్స్ రేకెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ఒక సరైన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అందరికీ ఓ పెద్ద ట్రీట్ లా ఫస్ట్ సింగిల్ ని అప్పుడు ప్లాన్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమా మినహా మిగతా పాన్ ఇండియన్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ ఆల్రెడీ వచ్చేసి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరి బహుశా ఈ సాంగ్ వచ్చే అక్టోబర్ 23 డార్లింగ్ బర్త్ డే కానుకగా వస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి దక్షిణాది భాషల ఆల్బమ్ ని జస్టిన్ ప్రభాకరన్ ఇస్తుండగా హిందీలో మిథున్, అలాగే మనన్ భరద్వాజ్ లు కంపోజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :