“RRR” నుంచి అప్పుడు నో అప్డేట్.?

“RRR” నుంచి అప్పుడు నో అప్డేట్.?

Published on Sep 7, 2021 8:27 PM IST


ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో అంతకు మించిన మాస్ ఎమోషనల్ దర్శకుడు రాజమౌళి ల కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అనధికారికంగా వాయిదా పడినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి వచ్చే అక్టోబర్ రేస్ లో నుంచి తప్పుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కొన్ని చిన్నప్పటి సన్నివేశాలపై షూట్ జరుపుకోనుంది.

అయితే ఈ భారీ చిత్రం నుంచి మేకర్స్ ఎప్పడికప్పుడు అప్డేట్స్ ఇస్తుండగా వచ్చే వినాయక చవితికి మాత్రం ఎలాంటి అప్డేట్ ఉండదు అన్నట్టుగా తెలుస్తుంది. సో ఈసారి పండగకి ఏ అప్డేట్ కోసం కూడా ఆలోచించకుండా తక్కువ అంచనాలు పెట్టుకుంటే బెటర్.. మరి ఈ కొత్త రిలీజ్ డేట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో కూడా చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ వ్యయంతో నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు