టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, అందాల భామ రీతూ వర్మ జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’ ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులోని కామెడీ సీన్స్‌కు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఓ పక్కా కమర్షియల్ చిత్రానికి సరిపోయేలా ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో సందీప్, రీతూ వర్మలకు సరిసమానంగా రావు రమేష్, మన్మధుడు ఫేమ్ అన్షుల ట్రాక్ కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించగా రాజేష్ దండ, ఉమేష్ బన్సల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.