జనవరి 26న బయటకురానున్న ‘భరత్ అనే నేను’ !
Published on Jan 15, 2018 6:19 pm IST

మహేష్ బాబు, కొరటాల కలయికలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఈరోజు సంక్రాతి సందర్బంగా రిలీజవుతుందని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో సాయంత్రం వరకు ఎదురుచూడగా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ మాత్రం జనవరి 26వ తేదీన సినిమా యొక్క మొదటి విశేషం బయటికొస్తుందని ప్రకటించారు.

మరి 26 రిపబ్లిక్ డే నాడు ‘టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్’ లలో దేన్ని రిలీజ్ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయ నైపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా కైరా అద్వానీ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి.

 
Like us on Facebook