సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఎం.సి.ఏ’ !

15th, December 2017 - 03:13:27 PM

యంగ్ హీరో నాని తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. వరుసగా విజయాలనందుకుంటూ ప్రేక్షకులకు మినిమమ్ గ్యారెంటీ సినిమాల్ని అందిస్తున్న నాని సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా సాయి పల్లవి నటిస్తుండగా భూమిక, రాజీవ్ కనకాలలు పలు కీలక పాత్రలు చేస్తున్నారు.