ఓవర్సీస్లో దుమ్ము దులిపేస్తున్న నాని, అఖిల్

గత వారం విడుదలైన రెండు చిత్రాలు నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, అఖిల్ ‘హలో’ చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్లో సైతం కలెక్షన్ల జోరు చూపిస్తున్నాయి. రెండింటి మధ్యా పోటీ ఉన్నా వేటికవే ప్రేక్షకుల్ని అలరిస్తూ వసూళ్లను రాబట్టుకుంటున్నాయి. గురువారం విడుదలైన ‘ఎం.సి.ఏ’ బుధవారంనాడు ప్రదర్శించిన ప్రీమియర్లతో కలిపి గురువారనమ్ శుక్రవారం కలిపి హాఫ్ మిలియన్లు దాటి 5. 3 లక్షల డాలర్లను రాబట్టుకుంది.

అలాగే అఖిల్ చేసిన ప్రమోషనల్ ఫలితంగా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘హలో’ గురువారం నాడు ప్రదర్శించిన ప్రీమియర్లతో 2.13 లక్షల డాలర్లు, శుక్రవారం నాడు 1.5 లక్షల డాలర్లు రాబట్టి మొత్తంగా 3.64 లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంది. ఇక ఈరోజు, రేపు సెలవులు కావడంతో ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది.