కృష్ణా జిల్లాలో ‘హలో, ఎం.సి.ఏ, ఒక్క క్షణం’ వసూళ్ల వివరాలు !

గత ఏడాది 2017 ఆఖరు నెలలో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, అఖిల్ రీలాంచ్ చిత్రం ‘హలో’, అల్లు శిరీష్, విఐ ఆనంద్ ల ‘ఒక్క క్షణం’ వంటి చిత్రాలు వరుసగా విడుదలై మంచి టాక్ తో నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏరియాల్లో ఈ చిత్రాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఏపి వసూళ్లలో ముఖ్యమైన కృష్ణా జిల్లాలో ఈ చిత్రాల వసూళ్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ముందుగా హిట్ టాక్ తో నడుస్తున్న ‘ఎం.సి.ఏ’ విషయానికొస్తే 12వ రోజు కూడా రూ.15.93 లక్షల షేర్ ను రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు రో.1.91 కోట్లు రాబట్టింది. అలాగే ‘హలో’ 11వ రోజు మంచి రన్ కనబర్చి రూ.7.06 లక్షలు వసూలు చేసి మొత్తంగా రూ. 92.05 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకోగా ‘ఒక్క క్షణం’ 5 రోజులకుగాను దాదాపుగా రూ.20 లక్షల షేర్ ను అందిపుచ్చుకుంది.