ప్రీ రిలీజ్ వేడుకకు సిద్ధమైన ‘ఎం.సి.ఏ’ !

నాని నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దమవుతోంది. ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా యొక్క ఆడియో కూడా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఆడియోను పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేయడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా ప్లాన్ చేశారు నిర్మాతలు.

ఈ నెల 16వ తేదీన వరంగల్ లో ఈ వేడుక జరగనుంది. వేడుకకు నాని, సాయి పల్లవి, నిర్మాత దిల్ రాజు, దర్సకుడి వేణు శ్రీరామ్ లతో పాటు ఇతర చిత్ర ప్రముఖులు హాజరుకానున్నారు. వరుస విజయాల మీదున్న నాని, ‘ఫిదా’ తో అందరి మెప్పూ పొందిన సాయి పల్లవిలు కలిసి నటిస్తుండంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.