భారీగా ఎం.సి.ఎ ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎంసిఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి). ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. సీనియర్ కెమెరామెన్ సమీర్ రెడ్డి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించాడు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 16 న హన్మకొండలో భారీగా ప్లాన్ చేసారు. నాని సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. త్వరలో సెన్సార్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా కు సంభందించి డబ్బింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.