‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ పై పెరుగుతున్న నమ్మకాలు !

12th, November 2017 - 02:21:45 PM

నేచ్యురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క టీజర్ మొన్న శుక్రవారం విడుదలైంది. టైటిల్ కు తగ్గట్టే టీజర్ కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీకి కనెక్టయ్యే విధంగా ఉండటం, స్క్రీన్ పై సాయి పల్లవి, నానిల జోడి కొత్తగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకాలు పెరుగుతున్నాయి.

ఈ చిత్రంతో కూడా నాని మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టీజర్ కు 4.8 మిలియన్ల వ్యూస్ దక్కాయి. సినీ వర్గాల్లో సైతం చిత్రం పట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ సంస్థ మంచి ధరను చెల్లించి కొనుగోలు చేసింది. ఈ సానుకూల అంశాలన్నింటినీ బట్టి చూస్తే చిత్ర విజయం ఖాయంగా కనిపిస్తోంది. నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.