వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కి ఆసక్తికరమైన టీఆర్పీ!

Published on Jan 20, 2022 3:30 pm IST

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి అనే సెన్సిటివ్ కాన్సెప్ట్ ను యూత్ కి మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం సాధించిన టీఆర్పీ రేటింగ్ బయటికి వచ్చింది. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టీఆర్పీ రావడం విశేషం. 9.31 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించగా, గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :