అఖిల్ దూకుడు మామూలుగా లేదుగా…యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్!

Published on Oct 21, 2021 11:35 am IST

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్ లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి రోజు నుండి ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ రావడం తో సినిమా కి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ చిత్రం యూ ఎస్ లో సైతం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

యూ ఎస్ లో ఈ చిత్రం తన దూకుడు ను కొనసాగిస్తుంది. ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. అఖిల్ అక్కినేని తో పాటుగా, చిత్ర యూనిట్ సినిమా విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :