రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ.. ఎవరికి ?

14th, October 2016 - 03:34:41 PM

ram-charan-about-baahubali
మామూలుగా అనుకున్నవి అనుకున్నట్టు జరిగుంటే రేపు మెగా ఫ్యాన్స్ కు పండగలా ఉండేదని చెప్పాలి. కానీ ఆ ఛాన్స్ మిస్సైపోయింది. ముందుగా చెప్పినట్టు మెగా హీరో రామ్ చరణ్ రేపు 15వ తేదీన అనగా రేపు న్యూ జెర్సీలో ‘హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనెస్ట్ టెర్రర్’ అనే కార్యక్రమంలో చరణ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వవలసి ఉంది. టెర్రరిజం భాదితులకు చేయూతగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చర్యను ను ఆహ్వానించారు ‘రిపబ్లికన్ హిందీ కొయిలిషన్’ ఛైర్మెన్ శాలి కుమార్. చరణ్ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. వస్తానని ప్రకటించారు కూడా.

కానీ ఇప్పుడు చరణ్ ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పేస్ బుక్ ద్వారా తెలుపుతూ ‘ఈ గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అందులో పెర్ఫార్మ్ చేయడానికి నేనూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. కానీ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ మూలంగా రాలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్’ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులంతా చరణ్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ముఖ్యమైన యూఎస్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నాడా.. అసలు మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి ? ఎవరైనా సరే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. అంటూ తమ ఆందోళనను, అభిమానాన్ని తెలుపుతూ మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి చరణ్ అభిమానుల కోసం ఎమర్జెన్సీ ఎవరికనేది పూర్తి క్లారిటీ ఇస్తే అభిమానవులకు కాస్త కొరతగా ఉంటుంది.