ఐశ్వర్య రాయ్‌ ను చూస్తే అసూయగా ఉంది – మీనా

Published on Oct 2, 2022 6:37 pm IST

సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవల తన భర్తను కోల్పోయిన దురదృష్టకరమైన విషయం తెలిసిందే. అయితే మీనా ఆ బాధ నుంచి బయట పడటానికి ఎక్కువగా సినిమాలు చూస్తున్నారట. ఈ క్రమంలో ఆమె పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా చూసింది. అనంతరం మీన ఈ సినిమా గురించి ఒక క్రేజీ పోస్ట్ ను షేర్ చేశారు.

ఇంతకీ మీనా ఏం పోస్ట్ చేశారో తెలుసా ?, ఆమె మాటల్లోనే.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ నటించిన నందిని పాత్ర నాకు ఎప్పటి నుంచో డ్రీమ్‌ రోల్. ఎప్పటికైనా ఆ పాత్రలో నేను నటించాలని కల కన్నాను. కానీ, ఆ పాత్రలో ఐశ్వర్య రాయ్‌ అత్యద్భుతంగా నటించింది. నా జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తిని చూసి అసూయపడుతున్నాను’ అంటూ మీనా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :