మళ్లీ తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్ !

Published on Apr 24, 2022 6:19 pm IST

సీనియర్ హీరోయిన్ మీనా సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా ప్రసుతం ఫుల్ బిజీగా ఉంది. తల్లి, సోదరి తదితర పాత్రలతో మీనా ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే.. తాజాగా మీనా పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపించి షాక్ ఇచ్చింది. పైగా ఈ వీడియోకి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది మీనా.

ఇంతకీ మీనా ఏమి పోస్ట్ చేసింది అంటే.. ‘అప్పట్లో నాకు ఈ గెటప్‌ వేయడం చాలా సులభంగా ఉండేది. నేను ఎక్కువగా దీన్ని కవర్‌ చేసేందుకు హెవీ చీరలు కూడా కట్టుకుంటూ ఉండేదాన్ని. ఇక ప్రస్తుతం ఈ గెటప్‌ కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్‌ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది’ అని మీనా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :