‘గుంటూరు కారం’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన మీనాక్షి చౌదరి

Published on Nov 20, 2023 5:19 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ హైప్ కలిగిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీని 2024 జనవరి 12న విడుదల చేయనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ గురించి తాజాగా ఒక జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఈ మూవీలో నటించడం ద్వారా తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ గారి ప్రక్కన హీరోయిన్ గా నటించాలన్న తన కల నెరవేరిందని అన్నారు. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, అది కూడా మహేష్ గారి కాంబినేషన్ లో కావడంతో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని తెలిపారు. సినిమా గురించి పూర్తిగా ఇప్పుడు ఏమి వెల్లడించలేనప్పటికీ ఆకట్టుకునే అద్భుతమైన కథ, కథనాలతో త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీని తెరకెక్కిస్తున్నారని అన్నారు. తప్పకుండా రానున్న సంక్రాంతికి మంచి మాస్ యాక్షన్ తో గుంటూరు కారం అందరినీ ఆకట్టుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం :