బాలయ్యకి జోడీగా మీనాక్షి చౌదరి ?

Published on Oct 2, 2023 11:02 am IST

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. ఐతే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి ని బాలయ్యకి జోడీగా సెలెక్ట్ చేశారని.. ఆమె పాత్రకు కథలో ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య బాబు – మీనాక్షి చౌదరి కాంబినేషన్ అంటే అదిరిపోతుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందట.

కాగా ఈ సినిమాలో బాబీ బాలయ్య ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :