నాని నుంచి మరో బ్యూటిఫుల్ ట్రీట్ గా “మీట్ క్యూట్” టీజర్.!

నాని నుంచి మరో బ్యూటిఫుల్ ట్రీట్ గా “మీట్ క్యూట్” టీజర్.!

Published on Nov 12, 2022 11:11 AM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా ప్రొడక్షన్ లో కూడా వాల్ పోస్టర్ బ్యానర్ తో పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన వెంచర్ నుంచి సినిమాలతో పాటుగా పలు ఓటిటి లోకి కూడా ఎంటర్ అయ్యి చేసిన మొదటి ప్రాజెక్ట్ నే “మీట్ క్యూట్”. నాని సోదరి దీప్తి గంట దర్శకత్వం వహించడం విశేషం.

మరి ఇప్పుడు ఈ సిరీస్ నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో అయితే చాలా మంది యువ నటీనటులు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇద్దరి కలయిక వారి మధ్య మాటలు చాలా ప్లెజెంట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. అలాగే నిర్మాతగా అయితే నాని అభిరుచి కూడా ఈ టీజర్ తో ఎలా ఉంటుందో మరో మళ్ళీ ప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు.

సీనియర్ నటులు సత్యరాజ్ నుంచి రుహాణి శర్మ, ఆదా శర్మ, సునైనా ఆకాంక్ష సింగ్ అలాగే శివ కందుకూరి, అశ్విన్ కుమార్ సహా ఇతర యంగ్ నటులు ఒక్కోఒకరికి ఒకో బ్యూటిఫుల్ స్టోరీ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే వీరి మధ్య కలయిక ఎమోషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి.

దీనితో అయితే ఈ సిరీస్ డెఫినెట్ గా ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ టీం లో సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ సిరీస్ థీమ్ కి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇక ఈ సిరీస్ హక్కులు అయితే సోని లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు