‘మీట్ క్యూట్’ ప్లెజంట్ వెబ్ సిరీస్ గా అందరినీ ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ దీప్తి గంటా

‘మీట్ క్యూట్’ ప్లెజంట్ వెబ్ సిరీస్ గా అందరినీ ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ దీప్తి గంటా

Published on Nov 22, 2022 3:06 AM IST


నాచురల్ స్టార్ నాని సోదరి దీప్తి ఘంటా తొలిసారిగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని నిర్మాతగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ యొక్క టీజర్, ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని వారిలో బాగా అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక ఈ నెల 25న ప్రముఖ ఓటిటి మాధ్యమం సోని లివ్ లో ప్రసారం కానున్న మీట్ క్యూట్ యొక్క ప్రీ స్ట్రీమింగ్ సెలెబ్రేషన్స్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ దీప్తి గంటా మాట్లాడుతూ, నేను గతంలో ఒక షార్ట్ ఫిలిం చేశాను. నిజానికి అప్పట్లో మీట్ క్యూట్ లో ఒక కథ రాసి నానికి వినిపిస్తే ఇలాంటివి ఇంకో మూడు నాలుగు రాస్తే వాటితో ఆంథాలజీ చేయొచ్చని సలహా ఇచ్చారన్నారు.

అయితే తనని మంచి ఆలోచన ఇన్స్ పైర్ చేసిన తరువాతనే స్క్రిప్ట్ రాశాను. ప్రయాణాల్లో, ఇతర సందర్భాల్లో ఎవరైనా తెలియనివారితో పరిచయం చేసుకుని మాట్లాడటం నాకు అలవాటు. అలాంటి అపరిచిత వ్యక్తుల మధ్య సంభాషణ అనే ఊహతో ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేసి మన లైఫ్ లో ఎదురయ్యే ప్లెజంట్ మూమెంట్స్ తో ఈ స్టోరీ రాయడం జరిగింది. సత్యరాజ్ గారు, అశ్విన్, ఆదా శర్మ ఇలాంటి మంచి ఆర్టిస్టులు నా కథలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అర్బన్ బేస్డ్ గా సాగుతుంది. అయినా అన్ని వర్గాల ప్రేక్షకులందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అతి త్వరలో ఓ మంచి లవ్ స్టోరి రాసి ఆ కథను నాని హీరోగా తెరకెక్కించాలని, అలానే మంచి ఫీల్ గుడ్ స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ చేయాలి అనేది తన ఆలోచన అని అన్నారు దీప్తి. అనంతరం హీరో నాని మాట్లాడుతూ, మొదట ఈ స్క్రిప్ట్ చదవకుండా కొన్నాళ్ళు పక్కన పెట్టాను. అయితే ఇది చదివిన వారంతా బాగుంది అని చెప్పినా, సరేలే అందరూ అలాగే చెప్తారుకదా అని భావించాను. ఇటీవల మా సిస్టర్ గట్టిగా చెప్పడంతో కొద్ది పేజీలు చదివేసరికి ఆ కథలో లీనమయ్యాను.

స్క్రిప్ట్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో పాటు తప్పకుండా ఇది ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే భావన కలిగింది. వాస్తవానికి ఈ స్క్రిప్ట్ ని ఎవరు రాసినా కూడా తప్పకుండా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చేవాడిని. మీట్ క్యూట్ లో క్యారెక్టర్స్, అవి మాట్లాడుకునే మాటలు, వాళ్ల మధ్య వచ్చే సందర్భాలు అన్నీ చాలా సహజంగా ఉండడంతో పాటు మనసుని తాకుతాయి. అయితే ఈ స్టోరీ మూవీగా తీయడం కుదరదు, ఎందుకంటే ఎంత నాచురల్ స్టోరీ తీసుకున్నా దానికి కొంత డ్రామా కలుపుతాం, దానికి సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. కానీ ఇందులో ఆ పాత్రలు తర్వాత ఎలా ముందుకెళ్తాయి, ఎలా ముగుస్తాయి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక నా సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను ఖచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా అనుకున్నారు, కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుందనే భావనతో నటించలేదు. ఆంథాలజీ అంటే ఒక్కో కథను ఒక్కొక్కరు డైరెక్ట్ చేస్తుంటారు, కానీ ఈ కథను దీప్తి ఒక్కరే తెరకెక్కించడం జరిగిందన్నారు. ఏదో ఒక మంచి విషయాన్ని, మంచి మాటను ఇది చూశాక నేర్చుకుంటాం. అయితే ఈ సిరీస్ లో రోహిణి గారు, ఆకాంక్ష మధ్య వచ్చే సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. మంచి కంటెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాల్ పోస్టర్ సంస్థ ద్వారా నిర్మిస్తా అని, తప్పకుండా ఇది ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు నాని.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు