“వీరసింహరెడ్డి” కి “మెగా 154” దర్శకుడి బెస్ట్ విషెష్.!

“వీరసింహరెడ్డి” కి “మెగా 154” దర్శకుడి బెస్ట్ విషెష్.!

Published on Oct 22, 2022 9:59 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి అయితే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు హీరోలుగా తమ కెరీర్ లో సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. మరి బాలయ్య కెరీర్ లో చేస్తున్న 107వ సినిమాకి నిన్ననే “వీరసింహా రెడ్డి” అనే పవర్ ఫుల్ టైటిల్ ని అయితే ఫిక్స్ చెయ్యగా దానికి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇంకా మెగాస్టార్ 154వ సినిమా టైటిల్ రావాల్సి ఉండగా దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి లేటెస్ట్ గా అయితే మెగా 154 దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) బాలయ్య “వీరసింహా రెడ్డి” చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేయడం ఆసక్తిగా మారింది.

“వీరసింహా రెడ్డి టైటిల్ సూపర్బ్ గా ఉందని నా బ్రదర్ గోపీచంద్ మలినేనికి అలాగే బాలయ్య గారికి సహా చిత్ర యూనిట్ కి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాని” మెగా డైరెక్టర్ తెలియజేయడం ఆసక్తిగా మారింది. మరి ఈ రెండు చిత్రాలని కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మాణం వహిస్తుండగా రెండు చిత్రాల్లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు