మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ డైరెక్టర్ విశిష్ట తో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంకి సంబందించిన టైటిల్ రిలీజ్ పై మేకర్స్ తాజాగా ఒక క్లారిటీ ఇచ్చారు. జనవరి 15 న, అంటే రేపు సాయంత్రం 5:00 గంటలకు టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ అప్డేట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న చిత్రం పై డైరెక్టర్ వశిష్ట చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో టాప్ 10 సినిమాల్లో టాప్ 3 లో ఈ సినిమా ఉండేలా తెరకెక్కిస్తా అంటూ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తంచేశారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
The revelation of MEGA MASS BEYOND UNIVERSE begins ????❤????#Mega156 Title Reveal on January 15th at 5 PM ????????
MEGASTAR @KChiruTweets @mmkeeravaani @boselyricist @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/w5MzjjRPDj
— Vassishta (@DirVassishta) January 14, 2024