Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన కెరీర్ 158వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో చేసిన చిరు లీక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.

కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో పాల్గొన్న మెగాస్టార్ మెగా 158 టైటిల్ ‘కదిరి’తో మొదలవుతుంది అని కన్ఫర్మ్ చేయడం ఆలస్యం ఇపుడు సోషల్ మీడియాలో ఎన్నెన్నో టైటిల్స్ వైరల్ గా మారాయి. అవి కూడా ఒకోటి మంచి మాస్ అండ్ కేజ్రీగా కూడా ఉండడం విశేషం.

కదిరి శివయ్య నాయుడు, కదిరి నరసింహా స్వామి, కదిరి రోడ్ నెం 158 ఇలా పలు ఆసక్తికర టైటిల్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. అయితే వీటికి మునుపే ‘కాకాజీ’ అనే టైటిల్ కూడా వినిపించిన సంగతి తెలిసిందే. సో వీటిలో అసలు టైటిల్ ఏంటి లేదా? పూర్తిగా కొత్తది ఏమన్నా వస్తుందా అనేది ఈ ఆగష్టు 22 తో క్లారిటీ వస్తుంది.

Exit mobile version