మెగా బ్లాస్ట్ : “వాల్తేర్ వీరయ్య” గా..ఫుల్ మాస్ మీల్స్ తో బాస్.!

మెగా బ్లాస్ట్ : “వాల్తేర్ వీరయ్య” గా..ఫుల్ మాస్ మీల్స్ తో బాస్.!

Published on Oct 24, 2022 11:27 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తన మెగా 154 కోసం అందరికీ తెలిసిందే. మళ్ళీ వింటేజ్ బాస్ చూపించి మాస్ పూనకాలు అంటే ఏంటో చూపిస్తానని యంగ్ దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) ముందు నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కి అయితే ఓ బిగ్ ప్రామిస్ ని అందించాడు. ఇక అక్కడ నుంచి ఎంతో అవైటెడ్ గా మారిన ఈ సినిమా నుంచి ఈ దీపావళి బ్లాస్ట్ గా మేకర్స్ అయితే ఫైనల్ గా టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు.

మరి దీనితో అయితే సినిమా టైటిల్ ని అనుకున్నట్టే “వాల్తేర్ వీరయ్య” గా అనౌన్స్ చెయ్యగా ఈ టైటిల్ టీజర్ మాత్రం వేరే లెవెల్ మాస్ గా ఉందని చెప్పాలి. బాస్ నుంచి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఆ మాస్ మీల్స్ అయితే దీనితో దొరికేసాయి. బాస్ నుంచి రియల్ కం బ్యాక్ లా ఇది అని అనిపిస్తుంది. తన డాషింగ్ యాటిట్యూడ్, గ్రేస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ అసలు సత్తా చూపించే రేంజ్ లో ఉన్నాయి.

ఇక ఈ అదిరే మాస్ విజువల్స్ తో దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత స్థాయిలోకి దీనిని తీసుకెళ్లింది. లాస్ట్ లో తన మార్క్ మాస్ దప్పుల బీట్స్ తో అయితే దుమ్ము లేచిపోయింది. ఇక ఈ సంక్రాంతి కి మాత్రం వీరయ్య బ్లాస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా అనిపిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు