లేటెస్ట్ పిక్స్ : క్లిన్ కారా తో మెగా ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్

Published on Sep 18, 2023 6:29 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇంట నేడు వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎంతో వైభవంగా జరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల తనయ క్లిన్ కారా నేడు మెగా ఇంటికి విచ్చేయడంతో పాటు పండుగ కూడా కావడంతో మెగాస్టార్ తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొద్దిసేపటి క్రితం తమ ఇంటి వినాయక చవితి వేడుకల పిక్స్ ని మెగాస్టార్ తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసారు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఇక ఈసారి ప్రత్యేకత, చిన్ని క్లిన్ కారాతో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ఎంతో ఆనందంగా అంటూ మెగాస్టార్ పెట్టిన పోస్ట్ మరియు పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :