మన టాలీవుడ్ లెజెండరీ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి తన నుంచి తన రేంజ్ సినిమాలు పడాలి అని అభిమానులు ఎప్పుడు నుంచో కోరుకుంటున్నారు. తన రీఎంట్రీ తర్వాత నుంచి ఆ లోటు ఇప్పటికీ ఉంది. మధ్యలో వాల్తేరు వీరయ్య పడి తన స్టామినా చూపించి భారీ లాభాలు అందించింది కానీ అది కూడా మెగా ఫ్యాన్స్ కి ఇంకా సరిపోలేదు.
పైగా తన లైనప్ పై కూడా ఒక క్లారిటీ లేని తరుణంలో మెగా ఫ్యాన్స్ అందరికీ బాస్ ఒక ఊహించని బ్లాస్ట్ ని అందించారు అని చెప్పాలి. మరి తన లైనప్ లో యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని నిర్మాతగా భారీ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఓ రేంజ్ కిక్ ఇచ్చారు. ఇక దీనికే ఇలా అంటే నెక్స్ట్ సినిమాలు కూడా ఊహించని దర్శకులతో ఉన్నాయి.
వాటిలో అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ సాలిడ్ ఎంటర్టైనర్ ఉంటే ఇది కాకుండా సిసలైన ప్రాజెక్ట్ మెగాస్టార్ వీరాభిమాని పాన్ ఇండియా సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగతో సినిమా ఖరారు అయ్యినట్టుగా తెలుస్తోంది. దీనితో మెగా ఫ్యాన్స్ కి మాత్రం చిరు లైనప్ ఇపుడు ఫుల్ మీల్స్ పెట్టినట్లు అయ్యిందని చెప్పాలి. ఇది ఇదే తమకి తమ బాస్ నుంచి కావాల్సింది అంటూ తన లైనప్ పట్ల ఇపుడు మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు.
మెగాస్టార్ తాండవం..బ్లాస్టింగ్ లైనప్ తో ఇది కదా కావాల్సింది..
మెగాస్టార్ తాండవం..బ్లాస్టింగ్ లైనప్ తో ఇది కదా కావాల్సింది..
Published on Dec 4, 2024 7:11 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- తెలుగులో “పట్టుదల”గా అజిత్ నెక్స్ట్.. ట్రైలర్ టైం లాక్
- “డాకు మహారాజ్” 4 రోజుల తెలుగు రాష్ట్రాల వసూళ్లు!
- షాకింగ్: “దేవర” విలన్ పై హత్యాయత్నం.. డీటెయిల్స్ ఇవే
- మహా కుంభమేళాలో బాలయ్య షూట్.. కానీ..!
- మూడు రోజుల్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్రేక్ ఈవెన్.. ఎక్కడంటే?
- చరణ్ నెక్స్ట్ పై క్రేజీ రూమర్ నిజమేనా?
- సాలిడ్ ధరకి “సంక్రాంతికి వస్తున్నాం” నాన్ థియేట్రికల్ హక్కులు!
- స్పెషల్ ప్లేస్ లో “డాకు మహారాజ్” చూసిన బాబీ