మెగా అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి !

28th, October 2016 - 01:15:01 PM

khaidi150
ప్రస్తుతం టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టులో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ కూడా ఒకటి. ఎనిమిదేళ్ల తరువాత చిరు రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం కావడం వలన ఈ సినిమా కోసం మెగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎనిమిదేళ్లుగా మేకప్ వేసుకొని చిరు ఈ సినిమాలో ఎలా ఉంటారు, సినిమా కోసం ఆయనలో ఎలాంటి మార్పులు చేసుకున్నారు. అసలు సినిమా పోస్టర్ మీద చిరు స్టిల్ చూసి ఎన్నాళ్లయిందో అని అభిమానులంతా ఖైధీ నెం 150 గా మెగాస్టార్ లుక్ చూడాలని ఉవిళ్లూరారు.

మొన్నీ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ లోగో లో చిరంజీవి పూర్తిగా కనిపించలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. సినిమాలో చిరంజీవి ఎలా ఉంటారో చూడాలని ఎదురుచూస్తున్నారు. వాళ్ళ కోసమే అన్నట్టుగా దీపావళి కానుకగా రేపు ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర టీమ్ ప్రకటించింది. దీంతో అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ బయటికొస్తుందా మెగాస్టార్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.