వైరల్ వీడియో : రామ్ చరణ్ కి ఘనంగా స్వాగతం పలికిన కర్నూల్ ఫ్యాన్స్

Published on Feb 11, 2023 2:07 am IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ RC 15 ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శంకర్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ పొలిటికల్ డ్రామా మూవీలో రామ్ చరణ్ కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ కోసం నేడు కర్నూల్ చేరుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. పాన్ ఇండియా స్టార్ అంటూ రామ్ చరణ్ కార్ వెంట అనేకమంది అభిమానులు హర్షద్వానాలతో వెంబడిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :