మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసిన చరణ్ 15 టైటిల్ ?

Published on Mar 9, 2023 7:05 am IST

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వానీ హీరోయిన్ గా మావేరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా కోసం తెలిసిందే. అయితే ఈ సినిమా చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో 15వ సినిమాగా వస్తుండగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఈ భారీ సినిమాకు గత కొన్నాళ్ల నుంచి పలు ఆసక్తికర టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టుగా టాక్ రాగా ఇప్పుడు ఫైనల్ గా అయితే సీఈఓ అనే సాలిడ్ టైటిల్ దాదాపు ఫిక్స్ అయ్యినట్టుగా టాక్ వచ్చింది.

మరి ఈ సరికొత్త టైటిల్ కి కూడా మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. సోషల్ మీడియాలో అయితే ఎవరి నుంచి కూడా ఈ టైటిల్ విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు. పైగా పాన్ ఇండియా ఆడియెన్స్ లో ఇది పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది అని సదరు మూవీ లవర్స్ కూడా అనుకుంటున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ అవైటెడ్ అప్డేట్ పై క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :